Bappam TV: ఐబొమ్మ రవి.. బప్పం టీవీ వెబ్‌సైట్‌ని ఎందుకు తెచ్చాడు? బప్పం అంటే అర్థమేంటి?
Bappam TV: ఐబొమ్మ రవిని అరెస్టు చెయ్యడంతో.. భారీ సినిమా పైరసీకి బ్రేక్ పడిందని పోలీసులు అనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు అంతగా ఫలించినట్లు కనిపించట్లేదు. మరిన్ని పైరసీ సైట్లు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ రవి బప్పం టీవీ వెబ్‌సైట్‌ని ఎందుకు తెచ్చాడో తెలుసుకుందాం. ఐబొమ్మ రవిని ఐదు రోజులపాటూ.. కస్టడీలో ప్రశ్నించిన పోలీసులకు.. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. మరో వారం పాటూ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో