iBOMMA - Watch iBomma Telugu Movies | iBOMMA.ONE 2025 bappamtv ibommaone ibomma

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్ స్టెప్పులు.. ఫుల్ క్రెడిట్ అతనిదే

587 0

ఏ అభిమానికి అయినా కూడా తమ హీరో నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ నే చూడాలి అనుకుంటారు. అయితే అది అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు కానీ వచ్చినపుడు మాత్రం అందులో తాము మిస్ అయ్యిన ఆనందం దొరికితే దానికి వెల కూడా కట్టలేరు. ఇప్పుడు అదే ట్రాన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ దేఖేలేంగే సాలా (Dekhlenge Saala) సాంగ్ ఇప్పుడు దుమ్ము లేపేస్తుంది..

సోషల్ మీడియాని ఊపేస్తున్న పవన్ డాన్స్ మేనియా

జెనరల్ గా మన హీరోస్ అభిమానులు తమ హీరోని దాటి ఇతర హీరోల వర్క్ కి అటెన్షన్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు అది జరిగింది. పవన్ నుంచి ఒక ఊహించని ఫీస్ట్ రావడంతో కేవలం పవన్ అభిమానులే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పవన్ డాన్స్ క్లిప్స్ వైరల్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పవన్ డాన్స్ మేనియానే కనిపిస్తుంది.

దర్శకుడిదే ఆ క్రెడిట్

అప్పుడు గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారో ఫ్యాన్స్ కి అలానే చూపించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని హరీష్ అందించారు. పవన్ ఫ్యాన్స్ ని బాగా చదివేసిన హరీష్ శంకర్ ఈ మొదటి సాంగ్ లో ప్రతీ ఫ్రేమ్ ని అందంగా మలిచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న పవర్ ఎనర్జీని మళ్ళీ తట్టి లేపి చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత హంగామా జరుగుతుంది అంటే ఆ పూర్తి క్రెడిట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడికే చెల్లుతుంది.

Related Post

Leave a comment

Your email address will not be published. Required fields are marked *